సొవ్వ గ్రామస్తులకు ఊటనిరే దిక్కు

ASR: డుంబ్రిగూడ మండలం సొవ్వ గ్రామంలో తాగునీరు సౌకర్యం కల్పించాలని గిరిజనులు వేడుకుంటున్నారు. గ్రామంలో ఉన్న కొళాయిలు, బోర్లు మూలకు చేరడంతో తాగునీరుకు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 550 కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, కలుషిత ఊటనీటిని సేకరించి తాగుతున్నామని తెలిపారు. దీంతో పలు వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు.