'అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి'
ATP: నార్పల తహశీల్దార్ కార్యాలయం ఎదుట CPI ఆధ్వర్యంలో సోమవారం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నప్ప యాదవ్ మాట్లాడుతూ.. జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు.