నేడు అండర్-15 వాలీబాల్ ఎంపిక

నేడు అండర్-15 వాలీబాల్ ఎంపిక

CTR: అండర్-15 వాలీబాల్ బాల, బాలికల ఎంపిక నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి వసంతవాణి వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అండర్-15 వాలీ బాల్ బాల, బాలికలకు శుక్రవారం ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ఎంపిక పోటీలను చిత్తూరు జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తామన్నారు.