జిల్లాలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
KMM: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 3నెలల రేషన్ బియ్యం ఉమ్మడి జిల్లాలో దారి మళ్లుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. KMM, SPL, KTDM, MNGRలో డీలర్లే వ్యాపారులై లబ్దిదారుల నుంచి కిలో రూ.15కు కొనుగోలు చేసి వాటిని కోళ్లఫారాలు రూ.25కి అమ్ముతున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యాపారం ఓపన్‌గా జరుగుతున్నా అధికారులు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడం విడ్డూరమని స్థానికులు అంటున్నారు.