శతాబ్ది వేడుకలకు మంత్రి సత్యకుమార్‌కు ఆహ్వానం
GNTR: సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఈనెల 23వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి(శతాబ్ది) వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను ఆహ్వానించారు. ట్రస్టు ప్రతినిధులు ఇవాళ ఏపీ సచివాలయంలోని కార్యాలయంలో మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.