VIDEO: సోమలలో కురుస్తున్న వర్షం

CTR: సోమలలో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో వర్షం పడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. కుంటలలోకి నీరు చేరాయి. వర్షాల నేపథ్యంలో వాగులు, కుంటల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.