బస్సు కండెక్టర్‌పై దాడి

బస్సు కండెక్టర్‌పై దాడి

MDCL: అల్వాల్ పరిధిలోని కంటోన్మెంట్ డిపోకు చెందిన 23T రూట్ బస్సులో కండక్టర్‌పై దాడి జరిగింది. బస్సును కోరిన చోట ఆపలేదన్న కోపంతో ఓ ప్రయాణికుడు కండక్టర్‌ను తన చేతి కడెంతో కొట్టాడు. ఈ దాడిలో కండక్టర్ తలకు తీవ్ర గాయమైంది. తప్పించుకోవడానికి ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.