ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

HYD: యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా మల్లాపూర్ ఐదవ డివిజన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెరుపుల జయంత్ గౌడ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారవు అరుణ్ పటేల్ హాజరై జెండా ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.