రైలు కింద పడి వ్యక్తి బలవన్మరణం

JN: నిడిగొండ బ్రిడ్జి సమీపంలో గురువారం రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతుడు జనగామ పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.