'ఈనెల 25న షట్టర్లకు వేలం పాట'
PDPL: ధర్మారం మండలం మేడారంలో గ్రామపంచాయతీ ఆధీనంలోని 6 వాణిజ్య షట్టర్లకు ఈనెల 25న వేలంపాట నిర్వహించనున్నట్లు కార్యదర్శి మౌనిక తెలిపారు. సర్పంచ్ వీర్పాల్ అధ్యక్షతన, ఎంపీఓ సమక్షంలో ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యాలయంలో వేలంపాట ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వేలంపాటలో పాల్గొనాలని ఆమె సూచించారు.