బాసర ఆలయంలో భక్తుల సందడి

బాసర ఆలయంలో భక్తుల సందడి

నిర్మల్: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ఉదయం నుండే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాస, కుంకుమార్చన పూజలు చేయించారు.