ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ నటుడు కన్నుమూత

మరాఠీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు అచ్యుత్ పోత్దార్(91) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన థానేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన దాదాపు 125 సినిమాల్లో నటించారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ '3 ఇడియట్స్'లో ఆయన ప్రొఫెసర్ పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.