వేంకటేశ్వరస్వామికి మామిడికాయల అలంకరణ
W.G: నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడప గ్రామంలో వేంచేసివున్న శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం అద్భుతమైన వేడుక జరిగింది. వసంత రుతువు ఆగమనానికి ప్రతీకగా, స్వామివారిని పచ్చని మామిడి కాయలతో అత్యంత రమణీయంగా అలంకరించారు. గర్భాలయంలోని మూలవిరాట్టును, ఇతర ఉప ఆలయాల్లోని దేవతామూర్తులను వందలాది మామిడి కాయలతో అలంకరించారు.