ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆల్లవరం మండలం ఎంట్రుకోన గ్రామంలో మంచినీటి వాటర్ ట్యాంకులకు ప్రారంభోత్సవాలు చేస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.