పీడీఎస్యూ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
VKB: డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో వరంగల్లో జరగనున్న పీడీఎస్యూ 23వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొజ్జి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఈ సభలు కీలకమన్నారు.