LIVE VIDEO: ఊహించని ప్రమాదం

AP: విశాఖ సీతమ్మధారలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. AMG ఆస్పత్రి ఎదురుగా ఉన్న రోడ్డులో స్కూటీపై మహిళ వెళ్తుండగా, ఆమెపై ఒక్కసారిగా చెట్టు కూలింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు ఎంవీపీ కాలనీకి చెందిన పూర్ణ(40)గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన CCTV వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.