అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
W.G: గుండుగొలను నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న భారీ రేషన్ బియ్యం లోడును పెనుగొండ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. దొంగరావిపాలెం చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆడుసుమల్లి కోటేశ్వరరావుకు చెందిన లారీని ఎస్సై గంగాధర్ పట్టుకున్నారు. సుమారు 33,280 కిలోల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు గుర్తించి, కేసు నమోదు చేశారు.