ఢీకొన్న రెండు లారీలు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఢీకొన్న రెండు లారీలు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

KDP: బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లె సమీపంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో, డ్రైవర్‌కు రెండు కాళ్లు విరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో లారీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.