విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేత
W.G: మొగల్తూరు మండలం కేపీ పాలెం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న మహిళా కళాశాల విద్యార్థులకు ఇవాళ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యం రూ. 21వేల ఆర్థిక సాయాన్ని ముగ్గురు విద్యార్థులకు అందించింది. కళాశాల ప్రిన్సిపల్ పి. ఇందిర చేతుల మీదుగా ఈ ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.