ఇంకా ఐదుగురు మిగిలిపోయారు: డీజీపీ

ఇంకా ఐదుగురు మిగిలిపోయారు: డీజీపీ

TG: ప్రస్తుతం లొంగిపోయిన 42 మంది మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీ కింద రూ. 1.93 కోట్లు అందిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య కార్డులు కూడా ఇస్తున్నామన్నారు. గత ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోస్టులు లొంగిపోయారని.. మొత్తంగా తెలంగాణకు చెందిన వాళ్లు దళంలో ఇంకా ఐదుగురు మిగిలారని తెలిపారు. వారిని కూడా లొంగిపోవాలని పిలుపునిస్తున్నామన్నారు.