VIDEO: సీఎంకు కృతజ్ఞతగా ట్రాక్టర్‌లతో రైతుల ర్యాలీ

NDL: నంది కోట్కూరు పట్టణంలో ఎమ్మెల్య గిత్త జయసూర్య ఆధ్వర్యంలో మంగళవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతులకు రూ. 7 వేలు అందించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతగా ర్యాలీ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గ రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.