'దాతల సాయం సద్వినియోగం చేసుకోవాలి'

CTR: శనివారం విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులకు దొమ్మరాజు శ్రీనివాసవర్మ రాతపుస్తకాలతోపాటు కావలసిన స్టేషనరీ వస్తువులను పంపిణీ చేశారు. ఈ మేరకు దాత తన తల్లిదండ్రులు ధనలక్ష్మి, జయదేవరాజు జ్ఞాపకార్థం సందర్భంగా విద్యార్థులకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దాతల సాయం సద్వినియోగం చేసుకోవాలని HM వెంకమరాజు పేర్కొన్నారు.