VIDEO: రహదారి సౌకర్యం లేక.. డోలిమోత

ASR: గిరి గ్రామాలలో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు నేటికీ డోలిమోత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలం చింతలపాలెంకు చెందిన సప్పి డాలమ్మ(నిండు గర్భిణి)కి ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామానికి రహదారి సౌకర్యం లేక అంబులెన్స్ రాక కుటుంబీకులు డోలికట్టి డాలమ్మను పెద్దకోట వరకు సుమరు 6 కిలోమీటర్లు మోసుకొచ్చారు. అక్కడి నుంచి 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు.