గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: MLC
ASF: పెంచికల్ పేట్ మండలం చేడ్వాయి, బొంబాయిగూడ గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాలకు ఉమ్మడి ఆదిలాబాద్ MLC విఠల్ శుక్రవారం భూమి పూజ చేశారు. MLC మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ భవన నిర్మాణ వ్యయం 20 లక్షల రూపాయలతో జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు.