VIDEO: 6వ వార్డులో ఇంటిపై కూలిన భారీ వృక్షం
ASF: బెజ్జూర్ మండల వ్యాప్తంగా ఈదురుగాలులు, వడగండ్ల వాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. గాలివాన దాటికి యాసంగి పంటలు పూర్తిగా దెబ్బతినగా, పలు ఇళ్లపై ఉన్న రేకుల షెడ్లు, కప్పులు ఎగిరిపోయాయి. 6వ వార్డులో ఒక భారీ వృక్షం విరిగి ఇల్లుపై పడటంతో భారీ నష్టం వాటిల్లిందని వార్డు సభ్యురాలు వజ్రమ్మ తెలిపారు. ఈ మేరకు అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని బాధితులు కోరారు.