మద్యం మత్తులో వీరంగం.. యువకుడికి జైలు శిక్ష
SKLM: పట్టణానికి చెందిన రవి మోహన్ అనే వ్యక్తి రోడ్డు మీద మద్యం మత్తులో వీరంగం సృష్టించగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు గురువారం అతన్ని సెకండ్ క్లాస్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్ కె.శివరామకృష్ణ ఎదుట హాజరుపరచగా, కోర్టు నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ఈ విషయాన్ని ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపారు.