అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

KRNL: కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడు గ్రామంలో వ్యాపార నష్టాలు, అప్పుల బాధతో మాల మునిస్వామి (57) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం పోలీసులు తెలిపిన వివరాలు.. కిరాణా దుకాణం నడిపిస్తున్న ఇతను ఈ నెల 25న విషద్రావణం తాగి ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.