ఆందోళన పడినా.. ఆదాయం తగ్గలేదు!

ఆందోళన పడినా.. ఆదాయం తగ్గలేదు!

TG: జీఎస్టీ శ్లాబులు సవరించినప్పుడు ఆదాయం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందింది. కానీ గత నెలలో పండుగలు ఆదుకున్నాయి. దసరా, దీపావళి సందర్భంగా మార్కెట్లు కళకళలాడటంతో గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో 8 శాతం పన్ను వసూళ్లు పెరిగాయి. అయితే దీపావళి సందర్భంగా బాణసంచా మార్కెట్లపై దృష్టి పెట్టి ఉంటే మరింత జీఎస్టీ ఆదాయం వచ్చేదట.