బేస్తవారిపేటలో సచివాలయం తనిఖీలు
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని పిటికాయ గుళ్ళ గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో రంగనాయకులు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. పెండింగ్ సర్వేలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.