VIDEO: పందుల బెడదను నివారించాలి: గ్రామ ప్రజలు
BHPL: మహాదేవపూర్ మండలం బెగుళూర్, సూరారం, రాపెల్లికోట గ్రామాల్లో పందుల సైర్వ విహారంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పందుల వల్ల దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు వస్తున్నాయని, చిన్నపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పందుల బెడదను నివారించాలని కోరుతున్నారు.