VIDEO: నానో యూరియాపై రైతులకు అవగాహన
KMR: మద్నూర్ రైతు వేదికలో మంగళవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా నానో యూరియా వినియోగంపై శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. నానో యూరియా పర్యావరణ అనుకూలమని, ఇది పంటలకు 80 శాతానికి పైగా నత్రజనిని అందిస్తుందని వివరించారు. సంప్రదాయ యూరియాకు ఇది ఉత్తమ ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సౌమ్య, రైతులు పాల్గొన్నారు.