పోలీసులతో మాజీ మంత్రి సీదిరి వాగ్వాదం

పోలీసులతో మాజీ మంత్రి సీదిరి వాగ్వాదం

AP: వైసీపీ నేత సీదిరి అప్పలరాజు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం రసాభాసగా మారింది. పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం చేపట్టింది. ఈ సమావేశానికి అప్పలరాజు పెద్దఎత్తున ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పాడ్డాయి. దీంతో పోలీసులకు, అప్పలరాజుకు మధ్య వాగ్వాదం జరిగింది.