కలెక్టరేట్‌లో అంబలి, చలివేంద్రం ఏర్పాటు

కలెక్టరేట్‌లో అంబలి, చలివేంద్రం ఏర్పాటు

KMR: జిల్లా కలెక్టరేట్‌లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి, చలివేంద్రం కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. వేసవి ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. TNGO జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు, బాటసారులు ఈ చలికేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు.