'గిరిజనులకు అత్యుత్తమ సేవలు అందించాలి'
ASR: జిల్లా కలెక్టర్ టీ.నిశాంతిని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పలువురు నేతలు సోమవారం కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌గా గిరిజనులకు అత్యుత్తమ సేవలు అందించాలని కోరారు. అలాగే గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగం సూర్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.