గంగమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు: ఎమ్మెల్యే

CTR: పలమనేరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి తెలిపారు. గంగమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ, దేవదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తోందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.