తాగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్
ATP: గుంతకల్లులోని ఎస్ ఎస్ ట్యాంక్ వద్ద ఉన్న తాగునీటి శుద్ధి కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మంగళవారం పరిశీలించారు. తాగునీటి శుద్ధి కేంద్రంలోని మోటార్ల తీరును పరిశీలించారు. వేసవికాలం దృశ్యా మున్సిపాలిటీలో తాగునీటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీటిలో క్లోరిన్ శాతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.