మున్సిపల్ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కలిసి పనిచేయాలి: స్పీకర్
VKB: మున్సిపల్ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కలిసికట్టుగా పనిచేసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి బడ్జెట్‌ను రూపొందించారు. స్పీకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.