ఉగ్రవాదుల దాడికి నిరసనగా ర్యాలీ

ప్రకాశం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉగ్రవాదుల దాడికి నిరసనగా కనిగిరి జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం పామూరు పట్టణంలో జనసేన నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు