VIDEO: గ్రామ కార్యదర్శి బదిలీపై గ్రామస్తుల నిరసన
WNP: అమరచింత మండలం నందిమల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాషిణి డిప్యూటేషన్ బదిలీని నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆదివారం గ్రామ పంచాయతీ వద్ద సమావేశమైన బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ నాయకులు.. అక్రమంగా బదిలీ చేయడం సరికాదని ఖండించారు. కార్యదర్శి ఏదైనా అక్రమాలకు పాల్పడితే గ్రామసభలో నిరూపించాలని, రాజకీయ కారణాలతో బదిలీ చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు.