అతివేగం.. వద్దు ప్రాణాలే ముద్దు: CI
KRNL: తుగ్గలి మండల కేంద్రంలోని ఏఎస్ కాలేజీ సమీపాన సోమవారం వాహనదారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'అతివేగం వద్దు.. ప్రాణాలే ముద్దు' అంటూ సీఐ పులి శేఖర్ వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలు వివరించారు. ప్రమాదాలు ఎవరికీ చెప్పి రావని, మనమే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాల నరసింహులు, పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.