దెబ్బతిన్న పంటల పరిశీలన AEO
KMR: బిక్కనూరులో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను AEO వినోద్ కుమార్ గౌడ్ పరిశీలించారు. పొలాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి,బాధిత రైతుల నుంచి వివరాలు సేకరించారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షం ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు కోరారు. పంట నష్టంపై సమగ్ర నివేదికను తయారు చేసి పంపిస్తామని తెలిపారు.