ఏబీఎన్‌ విష ప్రచారంపై వైసీపీ ఫిర్యాదు

ఏబీఎన్‌ విష ప్రచారంపై వైసీపీ ఫిర్యాదు

VSP: వైసీపీ జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు ఆధ్వర్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ఇటీవల ప్రసారమైన ప్రోమో, డిబేట్‌ల్లో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై చేసిన అసత్య, దూషణాత్మక వ్యాఖ్యలకు నిరసనగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కె.కె. రాజు మాట్లాడుతూ.. ఎల్లో మీడియా రాజకీయ ప్రయోజనాల కోసం విష ప్రచారం చేస్తోందన్నారు.