VIDEO: కొలనుపాకలో రోడ్డెక్కిన మహిళలు

VIDEO: కొలనుపాకలో రోడ్డెక్కిన మహిళలు

BHNG: ఆలేరు మండలంలోని కొలనుపాకలో మంచినీటి సమస్యతో మహిళలు రోడ్డెక్కారు. రోడ్లపై పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే మూడు, నాలుగు రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనలతో కాసేపు ట్రాఫిక్‌కు  అంతరాయం ఏర్పడింది.