నెహ్రూ చిత్రపటానికి మంత్రి తుమ్మల నివాళులు

నెహ్రూ చిత్రపటానికి మంత్రి తుమ్మల నివాళులు

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.