కోడిపందెం కేసులో ఏడుగురు అరెస్టు
అన్నమయ్య: ములకలచెరువు మండలంలో కోడిపందెం ఆడుతున్న ఏడుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాలవపల్లి పంచాయతీ పరిధిలోని బుద్దాల వారిపల్లి వద్ద జరుగుతున్న కోడిపందెంపై సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి మూడు పందెం కోళ్లు, రూ. 3,600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.