పెంచలయ్య హత్య కేసులో చివరి నిందితుడు అరెస్ట్
NLR: గంజాయి ముఠాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పెంచలయ్య హత్య కేసులో చివరి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టు హాజరు పరిచినట్లు సీఐ వేణు తెలిపారు. ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా 18 మంది నిందితులకు సంబంధం ఉన్నట్లు తేలడంతో ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు చెప్పారు. చివరి నిందితుడు అరవ పెంచలయ్యను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు