జాతీయస్థాయి పోటీల్లో తణుకు విద్యార్థులకు పతకాలు

జాతీయస్థాయి పోటీల్లో తణుకు విద్యార్థులకు పతకాలు

W.G: ఈనెల 5 నుంచి 15 వరకు విశాఖ పట్టణంలో జరిగిన 63వ జాతీయ స్థాయి రోలర్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తణుకు మాంటిస్సోరి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపించారు. ఈ మేరకు స్కూలు డైరెక్టర్‌ అనపర్తి ప్రకాశరావు మంగళవారం విద్యార్థులను అభినందించి మాట్లాడారు. జాతీయ స్థాయి పోటీల్లో 8 పథకాలు సాధించడం గర్వకారణం అని అన్నారు.