విద్యుత్ సమస్యలపై ప్రత్యేక లోక్ అదాలత్
KRNL: అపరిష్కృత విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ డివిజన్ ఈఈ శేషాద్రి తెలిపారు. నేడు వెల్దుర్తిలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఆవరణలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.