మన్నెంకొండ గుట్ట రోడ్డు భద్రతపై స్థానికుల ఆందోళన
MBNR: మన్నెంకొండ గుట్టపైకి వెళ్లే రోడ్డు మార్గం అత్యంత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి వెళ్లే మార్గంలో అనేక మూలమలుపులు ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపర్చేందుకు రోడ్ సేఫ్టీ అద్దాలు ఏర్పాటు చేయడం ద్వారా రహదారి భద్రతను మరింత మెరుగుపరచవచ్చని సూచిస్తున్నారు.