VIDEO: 'సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు భరోసా'

KMM: రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. గురువారం సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు రూ.9,88,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.